నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని గాంధీ ఎస్టేట్ ఏ బ్లాక్ లో మెడికవర్ హాస్పిటల్ మాదాపూర్ వారి సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడి బోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఎత్తు, బరువు, ఆర్బీఎస్, పల్స్ ఆక్సిజన్ లెవెల్స్, ఈసీజీ, తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పటల్ వైద్యులు డాక్టర్ ఇబ్రహీం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. అందుకోసం నిత్య వ్యాయామం, యోగా, ధ్యానం చేయాలన్నారు. సాధ్యమైనంతవరకు ఆకుకూరలు, పండ్లు, పాలు, పాల ఉత్పత్తులను, గుడ్లు, చేపలు, వైట్ మటన్ వంటి ఆహారాలను తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు.
మారిన జీవనశైలిలో పర్యావరణంలో వస్తున్న మార్పుల వలన యాంత్రిక జీవితం గడుపుతున్న నేటి మానవుడు ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి వారి సూచనలు సలహాలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు. ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఈ శిబిరంలో 90 మందికి వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు చౌదరి, రామ్మోహన్, శివరామకృష్ణ, యోగా టీచర్ నాగమణి, గాంధీ ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మాధవ స్వామి, శంకర్ రావు, గౌతమ్ సాహూ, వెంకటరావు, సౌరయ్య ,హాస్పిటల్ ప్రతినిధి సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.