లింగంపల్లి సదర్ లో ప్రభుత్వ విప్ గాంధీ, కార్పొరేటర్లు

నమస్తే శేరిలింగంపల్లి: దీపావళి పర్వదినంను పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి గ్రామంలో జరిగిన సదర్ సమ్మేళనంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. యాదవుల ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణునికి ఇష్టమైన పశువులను ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారన్నారు. దీపావళి పండగ తర్వాత దున్నపోతుల విన్యాసాలతో సదర్ ఉత్సవాలను నిర్వహించడం యాదవుల ఆనవాయితీగా వస్తోందని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆయన వెంట కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, ఉప్పలపాటి శ్రీకాంత్, పుష్పనాగేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు రామస్వామి యాదవ్ , వీరేశం గౌడ్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు పొడుగు రాంబాబు, కృష్ణ యాదవ్, అనిరుద్ యాదవ్, రమేష్, వేణు గోపాల్, రమణ, గోపాల్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

లింగంపల్లి సదర్ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here