సమస్యల సాధనకు త్వరలో ఇజ్జత్ నగర్ కాలనీ డెవలప్ మెంట్ కమిటీ

నమస్తే శేరిలింగంపల్లి:మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఇజ్జత్ నగర్ లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం ఇజ్జత్ నగర్ కాలనీ డెవలప్‌మెంట్ కమిటీని వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. హైటెక్ సిటీ కూతవేటు దూరంలో ఉన్న ఇజ్జత్ నగర్ కాలనీలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని, బస్తీ సమస్యల సాధన కోసం పార్టీలకు,‌ కులమతాలకు అతీతంగా బస్తీ డెవలప్‌మెంట్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. బస్తీలోని 938 ఇళ్లకు ప్రతి ఇంటికి ఒక ఓటు ఉంటుందని, డెవలప్‌మెంట్ కమిటీలో పోటీ చేసే వారికి ఓటు వేసి ఎన్నుకోవాల్సి ఉంటుందన్నారు. తద్వారా బస్తీ డెవలప్‌మెంట్ లో భాగంగా బస్తిలో సిసి కెమెరాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, బస్తీ స్మశాన వాటిక, శివాలయం తదితర అంశాలపై కమిటీ ముందుండి పని చేస్తుందని అభిప్రాయపడ్డారు. బస్తీవాసులు ఎస్ చక్రవర్తి, కే వెంకట స్వామి, ఎస్ నారాయణ, కే చందు యాదవ్, కృష్ణ నాయక్, బాలు నాయక్, హలీం, రాజేశ్వర్ రెడ్డి, తులసి రామ్, ఎం. వెంకటేష్, దాసు, బాబు తదితరులు పాల్గొన్నారు.

ఇజ్జత్ నగర్ డెవలప్ మెంట్ కమిటీ ఏర్పాటు కోసం సమావేశమైన కాలనీ వాసులు

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here