నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న పేదల కోసం ప్రవేశపెట్టిన ఉచిత మంచినీటి పథకాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు. ప్రభుత్వం జీహెచ్ఎంసీ పరిధిలో అందజేస్తున్న నెలకు 20 వేల లీటర్ల ఉచిత మంచినీటి పథకంపై అవగాహన కల్పించేందుకు మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎంఏ నగర్, స్టాలిన్ నగర్ బస్తీ ల్లో అవగాహన కల్పిస్తూ వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలోని గృహ అవసర వినియోగదారులకు నెలకు 20 వేల లీటర్ల ఉచిత నీటి పథకం కోసం డిసెంబర్ 31 వ తేదీ వరకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జలమండలి అధికారులు జీఎం రాజశేఖర్, డీజీఎం నాగప్రియ, మేనేజర్ సాయి చరిత, వర్క్ ఇన్‌స్పెక్టర్ రమేష్, స్థానికులు, సుప్రజా, రాణి, లత, రవి గౌడ్, హన్మంతరావు, అశోక్, వెంకటేష్, జంగం మల్లేష్, రాజు ముదిరాజ్, శివముదిరాజ్, రాజు తదితరులు పాల్గొన్నారు.