నమస్తే శేరిలింగంపల్లి:మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. డివిజన్ పరిధిలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సహకారంతో డివిజన్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డీఈ స్రవంతి, వర్క్ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథ్, డివిజన్ అధ్యక్షుడు బిఎస్ఎన్ కిరణ్ యాదవ్, వరలక్ష్మీ, రాజు కుమార్, కృష్ణ నాయక్, రాకేష్ యాదవ్, రవిరాజు తదితరులు పాల్గొన్నారు.