శేరిలింగంపల్లి, అక్టోబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శిగా కొనసాగుతున్న ఆమె ఆ పదవితోపాటు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె తన రాజీనామా లేఖను పార్టీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడికి అందజేశారు. తాను వ్యక్తిగత కారణాల వల్లే బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ జిల్లా కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తున్నానని లేఖలో తెలిపారు. తనకు సహకరించిన జిల్లా, నియోజకవర్గం నాయకులకు, స్థానిక నాయకులు, కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.






