అర్హులైన వారికి ఆహారభద్రత కార్డుల పంపిణీ-ఆగస్టు నుంచి రేషన్ సరుకులు: ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలోని పేద ప్రజలకు రేషన్ దుకాణాలతో సబ్సిడీ ద్వారా నిత్యావసర సరుకులను అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించిందని ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం చేపట్టిన నూతన ఆహార భద్రత కార్డుల( రేషన్ కార్డ్) పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ కమ్యూనిటీ హాల్ లో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్, కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, జగదీశ్వర్ గౌడ్, మంజుల రఘునాథ్ రెడ్డి తో పాటు ఏఎస్ఓ బాల సరస్వతి, తహశీల్దార్ వంశీ మోహన్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ చంద్రారెడ్డి తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కొత్త రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ అర్హులైన పేదవారికి రేషన్ కార్డ్ లు అందిస్తామని, పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. అర్హులైన పేదవారిని గుర్తించి రేషన్ కార్డ్ లు అందేలా చూడాలని అధికారులకు ప్రభుత్వ విప్ గాంధీ సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రవి ముదిరాజు, కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణ గౌడ్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు జంగం గౌడ్, చాంద్ పాషా, రమేష్, శశిధర్ రెడ్డి, కొండల్ రెడ్డి,బలరాం యాదవ్, నర్సింహ సాగర్,తిరుపతి యాదవ్, గుమ్మడి శ్రీనివాస్, నీలం లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ చౌదరీ, తాడెం మహేందర్, నందు, గణపతి, రవిశంకర్, రాజేష్ యాదవ్, రూప , కృష్ణవేణి, రవి గౌడ్, స్వామి సాగర్, సత్యం గౌడ్, మంగమ్మ, గిరి గౌడ్, అబేద్ అలీ, మతిన్, ఉస్మాన్, ఎర్ర రాజు, అశోక్ సాగర్, షేక్ రఫీ, నీలం లక్ష్మణ్ ముదిరాజ్, నీలం రామ్ ముదిరాజ్, హిమామ్, కేశం కుమార్ ముదిరాజ్, మహ్మద్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

కొండాపూర్ డివిజన్ పరిధిలోని‌ కొత్తగూడ కమ్యూనిటీ హాల్ లో ఆహారభద్రత కార్డులను అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here