నమస్తే శేరిలింగంపల్లి:75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ లో ఘనంగా నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంఛార్జి గజ్జల యోగానంద్, గౌరవ అతిథిగా రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ హాజరయ్యారు. జాతీయ జెండాను డివిజన్ అధ్యక్షుడు రాజు శెట్టి కురుమ ఆవిష్కరించారు. కార్యక్రమంలో గజ్జల యోగానంద్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన యోధులను గుర్తు చేశారు. వారి త్యాగ ఫలంతో ఈ రోజు స్వేచ్ఛ వాయువులు పీల్చగలుగుతున్నామని అన్నారు. స్వాతంత్రం అనంతరం దేశం విచ్చిన శక్తుల చేతిలో పడి అతలాకుతలమయై అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. బీజేపీ అధికారం లోకి వచ్చిన తర్వాతే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని, ప్రధానమంత్రి మోదీ పాలన లో మన దేశానికి పూర్వ వైభవం వచ్చిందని అన్నారు. త్వరలోనే భారత్ విశ్వ గురువుగా నిలవనుంది అని వారు ఈ సందర్భంగా చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర దళిత మోర్చా అధికార ప్రతినిధి కాంచన కృష్ణ, రంగారెడ్డి అర్బన్ జిల్లా బిజెపి మేధావుల సెల్ కన్వీనర్ రాఘవేందర్ రావు, ఓ.బీ.సి మోర్చా కార్యదర్శి భరత్ రాజ్, శేరిలింగంపల్లి అసెంబ్లీ మహిళ మోర్చా కో కన్వీనర్ భీమణి విజయ లక్ష్మి, ఉపాధ్యక్షులు బాలరాజు, ప్రధాన కార్యదర్శి సత్య కుర్మా, కార్యదర్శి వీరేశ్ ఖెల్గి, కోశాధికారి కౌసల్య, సీనియర్ నాయకులు భీమణి సత్య నారాయణ, వి. గాయత్రి, నీలకంఠ రెడ్డి, అనిత, అనిత అమర్, ఎళ్లేష్ కురుమ, అమర్, గజ్జల శ్రీనివాస్, కే. ఆనంద్, మస్తాన్ షేక్, శ్రీనివాస్, శివ, గిరి, రమేశ్, బబ్లూ, ఆకాశ్ స్థానికులు పాల్గొన్నారు.