శేరిలింగంపల్లి, జనవరి 29 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో వీధి దీపాల (స్ట్రీట్ లైట్స్) సమస్యలను పరిష్కరిస్తామని కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ అన్నారు. డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ కాలనీలో నూతన వీధి దీపాల (స్ట్రీట్ లైట్స్)ను అమరుస్తున్న పనితీరును స్థానిక నాయకులు, కాలనీవాసులతో కలసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. మియాపూర్ డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్ కాలనీలో నూతన వీధి దీపాల (స్ట్రీట్ లైట్స్)ను అమరుస్తున్న పనితీరును స్థానిక నాయకులు, కాలనీవాసులతో కలసి పరిశీలించడం జరిగిందని, మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో విడతల వారీగా నూతన వీధి దీపాలను (స్ట్రీట్ లైట్స్) ను ఏర్పాటు చేస్తామని, కాలనీల వారీగా నూతన వీధి దీపాలు అమర్చడం జరుగుతుందని, ప్రతి కాలనీలలో పనిచేయని వీధి దీపాలను పునరుద్ధరిస్తూ వీధి దీపాలను అమర్చే పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. డివిజన్ పరిధిలో ఏదైనా కాలనీలో వీధి దీపాల సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి స్ట్రీట్ లైట్స్ సూపర్ వైజర్ శ్రీనివాస్, స్టాలిన్ నగర్ కాలనీ వాసులు రాణి, వెంకటేష్, శ్యామల, నరేష్, మొహిన్ బాయి , హనుమంతరావు సాగర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.