తుల్జా భ‌వాని ఆల‌య అభివృద్ధికి కృషి: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంపల్లి‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్ లో ఉన్న తుల్జా భవానీ ఆలయంలో ఆలయ‌ కమిటీ ఏర్పాటు చేసిన కమిటీ సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అర్చకులు నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంత‌రం తుల్జా భవాని అమ్మవారిని దర్శించుకున్నారు. తరువాత కమిటీ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.

తుల్జా భ‌వాని ఆల‌య క‌మిటీ స‌భ్యుల‌తో స‌మావేశ‌మైన కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం గ్రామస్థులు అందరూ ఏకాభిప్రాయంతో కలిసి అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయాలని, ఆలయ నిర్మాణం కోసం తాను వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాన‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ శర్మ, కమిటీ సభ్యులు జి. సంజీవ రెడ్డి, గోయిని చారి, సంపత్ గుప్తా, రేణుక‌, రాజు తివారి, గణపురం రవీందర్, తెరాస‌ డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, తారా నగర్ బస్తీ కమిటీ అధ్యక్షుడు జనార్దన్ గౌడ్, వార్డు మెంబర్ కవిత గోపి, సీనియర్ నాయకులు పాండు, బచ్చిరాజు, మాలచంద్, రామచందర్, లక్ష్మారెడ్డి, మాణిక్యం పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here