చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని శ్రీరాం నగర్, ఇక్రిశాట్ కాలనీ, కెఎస్ఆర్ లే అవుట్, అపర్ణ లేక్ ఫ్రీజ్, దీప్తి శ్రీనగర్, శ్రీకృష్ణ దేవరాయ కాలనీలలో బీజేపీ రాష్ట్ర నాయకుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి డివిజన్ బీజేపీ అభ్యర్థి కసిరెడ్డి సింధురెడ్డి గురువారం ఎన్నికల ప్రచారం, రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రేటర్‌లో తెరాస ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. తెరాస నాయకులు గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. బీజేపీకి ఓటు వేస్తేనే అభివృద్ధి జరుగుతుందని, అన్ని సంక్షేమ పథకాలు సరిగ్గా అమలవుతాయని అన్నారు. కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
సినీ నటి మాధవీలత ప్రచారం…
చందానగర్‌లో డివిజన్ బీజేపీ అభ్యర్థి కసిరెడ్డి సింధురెడ్డికి మద్ధతుగా సినీ నటి మాధవీలత ప్రచారం నిర్వహించారు. కేవలం బీజేపీతోనే చందానగర్ డివిజన్ అభివృద్ది చెందుతుందన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడం ఖాయమన్నారు.