నమస్తే శేరిలింగంపల్లి: ఆల్ ఇండియా రెడ్డీస్ అసోసియేషన్(ఐరా), రెడ్డీస్ వెల్ఫేర్ అసోసియేషన్ శేరిలింగంపల్లి సంయుక్త ఆధ్వర్యంలో జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిని శనివారం తార్నాకలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం సన్మానించారు. రెడ్డి సామాజిక వర్గానికే బల్దియా మేయర్, డిప్యూటీ మేయర్ భాద్యతలు రావడం యావత్ రెడ్డి సమాజం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ క్రమంలోనే అన్ని వర్గాలను సముచిత న్యాయం చేస్తూనే రెడ్డి సమాజ అభివృద్ధికి సహకారం అందించాలని రెడ్డి సంఘాల ప్రముఖులు డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డిని కోరారు. ఈ సన్మాన కార్యక్రమంలో రెడ్డీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు నల్లా సంజీవరెడ్డి, అఖిలభారత రెడ్డిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ ప్రచార కార్యదర్శి జి . అనిల్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరు గోవర్ధన్ రెడ్డి ,సంగా రెడ్డి జిల్లా అధ్యక్షులు అంతి రెడ్డి, శేరిలింగంపల్లి రెడ్డి అసోసియేషన్ కోశాధికారి దుగ్గి రవీంద్రరెడ్డి, కటిక రెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నతోట అజయ్ కుమార్ రెడ్డి,టి నరసింహారెడ్డి పాల్గొన్నారు.






