పోరాటాలు చేసే పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ: రామకృష్ణ – ఘనంగా 97వ వార్షికోత్సవ వేడుకలు

నమస్తే శేరిలింగంపల్లి: దేశ, రాష్ట్ర సాధనలో అలుపెరుగని పోరాటం చేసిన చరిత్ర కమ్యూనిస్టుల కే దక్కుతుందని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ 97వ వార్షికోత్సవ, సీపీఐ వ్యవస్థాపక వేడుకలను శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని పలు బస్తీల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను చేశారు. ఖానామెట్ చౌరస్తాలో మండల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీపీఐ మండల‌ కార్యదర్శి రామకృష్ణ పాల్గొని మాట్లాడారు. రాబోయే కాలంలో భారతదేశానికి, ప్రపంచ దేశాలకు ప్రత్యామ్నాయం ఎర్ర జెండా పార్టీలే అని అన్నారు. భారతదేశ స్వతంత్ర పోరాటంలో, తెలంగాణ పోరాటంలో ఎంతో మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. కార్మిక,కర్షకుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అన్నారు. భారత దేశానికి వెన్నెముక అయిన రైతుల కోసం భూమి, భుక్తి, దున్నే వానిదే భూమి కావాలని దొరలకు, భూస్వాములకు, జాగీర్దార్ లకు నవాబులకు వ్యతిరేకంగా తెలంగాణ రైతుసాయుధ పోరాటం చేసిన చరిత్ర కమ్యూనిస్టులది అన్నారు. ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. పార్టీ పేదల పక్షాన గూడు కోసం, పట్టెడు అన్నం కోసం విద్య, వైద్యం కోసం నిరంతరం పోరాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి, కె.చందు యాదవ్, డి. రవి, ఇసాక్, రాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

సీపీఎం వార్షికోత్సవ వేడుకల్లో సీపీఎం నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here