నమస్తే శేరిలింగంపల్లి: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఇనార్బిట్ మాల్, ఖానామెట్, సిఆర్ ఫౌండేషన్, రాఘవేంద్ర కమాను కాలనీలలో మండల కార్యదర్శి రామకృష్ణ జెండా ఆవిష్కరణ చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయినా పాలకులు ఇంతవరకు కనీసం విద్య, వైద్యం ప్రతి పేదవాడికి అందేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. రాష్ట్రంలో లో దళిత బంధు రాష్ట్రమంతటా ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ లు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డులు, పెన్షన్లు ఇవ్వాలని, ఆరోగ్యశ్రీలో కోవిడ్ 19 ని చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాఘవేంద్ర కమాన్ లో ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు రక్తపు వినయ్ గౌడ్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు కన్యాగారి నర్సింహ్మరెడ్డి, ఏఐటియుసి మండల కార్యదర్శి చందు యాదవ్, మండల కార్యవర్గ సభ్యుడు కృష్ణ ముదిరాజ్, ఆంజనేయులు, ఖానా మెట్ శాఖ సహాయ కార్యదర్శి రవి, రాజు, తదితరులు పాల్గొన్నారు.