శేరిలింగంపల్లి, ఆగస్టు 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నల్లగండ్లలోని వర్టెక్స్ విల్లాస్ స్వగృహంలో శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మాజీ స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్ పర్సన్ రాగం సుజాత యాదవ్ కుటుంబ సమేతంగా వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వేద పండితులచే విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం, డివిజన్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖంగా ఉండాలని, రైతుల పంటలు సమృద్ధిగా పండాలని వినాయకుడిని కోరుకున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ దేవుడి పట్ల విశ్వాసం కలిగి తోటి వారికి తమవంతు సహకారం అందించాలని కోరారు.






