శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): వినాయక చవితి నవరాత్రుల పండుగ సందర్భంగా కొండాపూర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో ఏర్పాటుచేసిన పలు వినాయక మండపాలను కార్పొరేటర్ హమీద్ పటేల్ సందర్శించి ప్రత్యేక పూజలు చేసి, అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ ఏ బ్లాక్, గచ్చిబౌలి ఓల్డ్ పీజేఆర్ నగర్, రాఘవేంద్ర కాలనీ సీ బ్లాక్, గోల్డెన్ తులిప్ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలకు కార్పొరేటర్ హమీద్ పటేల్ హాజరై స్థానిక కాలనీవాసులు, పలువురు నాయకులు, భక్తులతో కలసి ఆ విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేసి ప్రార్థించారు. విఘ్నాలు తొలగించే ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలన్నారు. ప్రజలు కోరుకునే పనులు విజయవంతం కావాలని, తలపెట్టిన ప్రతి కార్యం ఘనవిజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరుడిని కోరుకుంటున్నాని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జూపల్లి శ్రీనివాస్ రావు, బాల్ రెడ్డి, విజయలక్ష్మి, విద్యా సాగర్ రెడ్డి ఎస్వియన్ రాజు, బిక్షపతి, పుల్లారెడ్డి, సురేందర్ రెడ్డి, కచ్చావ దీపక్, శివ కుమార్ రాజు, కృష్ణ, గిరిధర్, రాకేష్, విజయ్ శర్మ, శ్రీనివాస్, ప్రకాష్, కార్తీక్, పగిడి శివ, ఈరన్న, హేమంత్, సాయి, బాల, వెంకటేష్, రమణ, విరాట్, మధు, సందీప్, రాజు, జున్ను, సుధీర్, చందు, బాబీ, అస్మిత్, తిరుపతి, బాబు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.





