మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్, రాజారాం కాలనీ, దోబీ ఘాట్‌లలో డివిజన్ తెరాస అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 1వ తేదీన ప్రజలు తమ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి వారికి మళ్లీ సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు ప్రతి ఒక్కరు సైనికులలాగా పనిచేసి అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దోబీ ఘాట్లకు ఉచిత విద్యుత్ ను ఇస్తామని ప్రకటించడంపై సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.


నవభారత్ నగర్‌లో…
మాదాపూర్ డివిజన్ పరిధిలోని నవభారత్ నగర్‌లో మాజీ ఎమ్మెల్సీ పోల రవీందర్‌తో కలిసి డివిజన్ తెరాస అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. అభివృద్ధికి ప్రజలు ఓటు వేయాలని, మాదాపూర్ డివిజన్ లో గెలిచి సీటును సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు కానుకగా ఇవ్వాలన్నారు. ప్రజలకు సేవ చేసుకునే భాగ్యాన్ని మరొక సారి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

