స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వేలో పూర్త‌యిన మొద‌టి రౌండ్

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 10 (నమ‌స్తే శేరిలింగంప‌ల్లి): సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల‌ సర్వేలో భాగంగా చందానగర్ సర్కిల్ లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో కుటుంబాల వారీగా వివరాల సేకరణకు సూపర్వైజ‌ర్లకు, ఎన్యుమరేటర్ల‌కు అప్పగించిన మొదటి రౌండ్ కుటుంబాల గుర్తింపు పూర్త‌యింది. రెండో రౌండ్ లో భాగంగా గుర్తించిన కుటుంబ సభ్యుల వివరాల సేకరణకు ఎన్యుమరేటర్లకు మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ పి.మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ కుటుంబ సర్వే లో భాగంగా ప్రతి ఎన్యుమరెటర్ రోజూ పది నుండి పదిహేను కుటుంబాల సభ్యుల వివరాలను ఫారంలో అడిగిన విధంగా తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా నమోదు చేయాలని ఆదేశించారు.

వివరాల‌ను త‌నిఖీ చేస్తున్న డీసీ మోహ‌న్ రెడ్డి

ప్రతి 10 మంది ఎన్యుమరే టర్లకు ఒక సూపర్వైజర్ లాగా క్షేత్ర స్థాయిలో విధులు కేటాయించాల‌ని, సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులము వివరాల‌ను జాగ్రత్తగా మార్గదర్శక పుస్తకంలో సూచించిన ప్రకారం పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని, ప్రతి రోజు సంబధిత సూపర్వైజ‌ర్లు పది శాతం ఎన్యూమరేటర్ల నమోదును క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి ఎన్యుమరేటర్లకు తగు మార్గదర్శకత్వం చేయాలని డిప్యూటీ కమిషనర్ ఆదేశించారు. ఈ కుటుంబ వివరాల సేకరణ జరుగుతున్న తీరును డిప్యూటీ కమిషనర్ సిబ్బందితో కలిసి 110వ‌ వార్డులోని శాంతినగర్ లో ఆకస్మిక తనిఖీ నిర్వహించి ఎన్యుమరెటర్ కు, తగు సూచనలు చేశారు. ఈ కుటుంబ వివరాల సేకరణకు సర్కిల్ పర్యవేక్షకులుగా ప్రధాన కార్యాలయం నుండి అడిషనల్ కమిషనర్ చంద్రకాంత్ రెడ్డిని పర్యవేక్ష్కుడిగా నియమించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ACP నాగిరెడ్డి, ప్రాజెక్టు అధికారిణి ఉషా రాణి, ఏఎంపీలు విజయ్ కుమార్, కృష్ణ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here