నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది పేద కుటుంబాలకు ఆసరా లభిస్తోందని ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొంది ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న బాధిత కుటుంబాలకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ రూ. 2.99 లక్షల చెక్కును ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి బాసటగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, చంద్రారెడ్డి, బ్రిక్ శ్రీను, కాశీనాథ్ యాదవ్ తదితరులు ఉన్నారు.