సీఎంఆర్ఎఫ్ పేదలకు ఆపన్నహస్తంలా మారింది- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు ఆపన్నహస్తంలా మారిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ. 60 వేల చెక్కును మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి శనివారం బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమంబండ కి చెందిన ఎండీ అహ్మద్ కు అత్యవసర చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోహా ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ. 60 వేలు అందజేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు బాసటగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, బ్రిక్ శ్రీను, కాశినాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here