శేరిలింగంపల్లి, అక్టోబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.5 లక్షల విలువైన LOC పత్రాలని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని కొత్తగూడ విలేజ్ కి చెందిన శివ శంకర్ రెడ్డికి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా CMRF ద్వారా మంజూరైన రూ.5 ఐదు లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF- LOC మంజూరు పత్రాన్ని బాధిత కుటుంబానికి ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ కార్యక్రమంలో సంజీవ రెడ్డి, చంద్రమోహన్ సాగర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.