పార్టీ సభ్యత్వంలో శేరిలింగంపల్లిని నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిల‌పాలి: ఎంపీ ర‌ఘునంద‌న్ రావు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని పార్టీ సభ్యత్వంలో నంబర్ వన్ గా నిలపాల‌ని మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు అన్నారు. పార్టీ కోసం పని చేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుంద‌ని, పార్టీ కార్యకర్తలే మూలస్థంభాలు అని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్‌రామ్‌గూడ హనుమాన్ దేవాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త, నాయకుడు అధికంగా సభ్యత్వ‌ నమోదు చేయించి శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని పార్టీ సభ్యత్వంలో నంబర్ వన్ గా నిలపాల‌ని కోరారు.

కార్య‌క్ర‌మంలో మాట్లాడుతున్న ర‌ఘునంద‌న్ రావు

కేంద్ర ప్రభుత్వ పథకాల‌ను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాల్సిన బాధ్య‌త మీ అందరిపై ఉందన్నారు. తెలంగాణలో వ్యక్తుల కోసం కాకుండా స్వచ్ఛమైన, నీతివంతమైన పాలన సాగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నార‌ని, ప్రపంచ చిత్రపటం మీద భారతదేశ ఔన్నత్యాన్ని సగౌర్వంగా నిలబెట్టిన బిడ్డ నరేంద్రమోదీ అని అన్నారు. సభ్యత్వ నమోదుకు తక్కువ రోజులు ఉన్నందున వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, బూత్ కమిటీ ఇంచార్జిలు, బూత్ కమిటీ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇంచార్జిలు, డివిజన్ నాయకులు, బీజేవైఎం నాయకులు, యువ మోర్చా నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

స‌భ్య‌త్వ న‌మోదు ప‌త్రాల‌ను అంద‌జేస్తున్న ఎంపీ ర‌ఘునంద‌న్ రావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here