మాదాపూర్, సెప్టెంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం సాయి చరణ్ బృందంచే కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించగా చూపరులను ఎంతగానో అలరించింది.
గణేష్ కౌత్వం, జతిస్వరం, బృందావన నిలయం, దశావతార శబ్దం, మండూక శబ్దం, రుక్మిణి ప్రవేశ దరువు, అష్టపది, రామాయణ శబ్దం, దుర్గ తరంగం, హిందోళ తిల్లాన మొదలైన అంశాలను సాయి చరణ్, చక్రవర్తి, ఐశ్వర్య, చందన, తేజస్వి ప్రఖ్యా, స్నేహ, సౌందర్య లు చక్కని అభినయం, తాళ లయ సమ్మేళనంతో ప్రదర్శించారు. వారి నృత్య ప్రదర్శనలను ఆద్యంతం సందర్శకులను అలరించాయి.