నమస్తే శేరిలింగంపల్లి: నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేసి సాంకేతిక రంగంలో మంచి నైపుణ్యం సాధించేందుకు చేతన ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనీయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. చేతన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ నివాసంలో ఉచితంగా ల్యాప్ టాప్ లను ఎమ్మెల్యే కోనేరు కొనప్ప తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని 20 మంది పేద విద్యార్థులను ఎంపిక చేసి వారిలో సాంకేతిక నైపుణ్యాన్ని మెరుగుపర్చేందుకు చేతన ఫౌండేషన్ ల్యాప్ టాప్ లను అందజేయడం అభినందనీయమని అన్నారు. తమ తమ రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఉన్నతంగా ఎదిగి మరింత మందికి సహాయం చేయాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. చేతన ఫౌండేషన్ చైర్మన్ రవి 8 దేశాలలో ఫౌండేషన్ సేవలను కొనసాగించడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, చేతన ఫౌండేషన్ ప్రతినిధులు సీతారామ రావు, సురేష్, వెంకట రమణి, నాగేశ్వరరావు, ప్రదీప్, రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.