నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని జవహర్ నగర్ కాలనీ, కైలాస్ నగర్ కాలనీ, వీకర్ సెక్షన్ తదితర కాలనీలలో స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారు. కాలనీలలో నెలకొన్న సమస్యలను ప్రజల ద్వారా అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా రోడ్ల పై, ఖాళీ స్థలాల్లో ఉన్న వ్యర్థాలను శానిటేషన్ సిబ్బంది సహాయంతో తొలగించారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని ఎంటమాలజీ సిబ్బందికి సూచించారు. జవహర్ నగర్ కాలనీ వాసులు తమకు పార్కును ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. కైలాస్ నగర్ వీకర్ సెక్షన్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులైన్లు ఏర్పాటు చేయాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, ఆయా శాఖల అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.