నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని వేమన రెడ్డి కాలనీ, వేమన రెడ్డి వీకర్ సెక్షన్ కాలనీ, శివాజీ నగర్, అపర్ణ హిల్స్ కాలనీలలో స్థానిక కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి ఐదో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీలలో నెలకొన్న సమస్యలను ప్రజలు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. కాలనీలలో పైపులైన్ల లీకేజీ కారణంగా రోడ్లపై నీరు ప్రవహిస్తుందని, రోడ్లు అధ్వాన్నంగా మారాయని అన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించి కాలనీ రోడ్లు మరమ్మతులు చేపట్టాలని జీహెచ్ఎంసీ అధికారులకు కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ అధికారులు, కాలని వాసులు, టీఆర్ఎస్ నాయకులు జనార్ధన్ రెడ్డి, గురు చరణ్ దూబే, ఓ వెంకటేష్, నాగరాజ్ పుల్లిపాటి, ఎల్లమయ్య, వరలక్ష్మి రెడ్డి, అక్బర్ ఖాన్, నరేందర్ బాల, యూసుఫ్, యశ్వంత్, కార్తీక్ గౌడ్, అమిత్ దూబే, ఉదయ్, అస్ఫర్, అల్తాఫ్, శ్రీనివాస్ రెడ్డి , నాగి రెడ్డి, రామ స్వామి, ఎస్ఎన్ రెడ్డి, మల్లేష్, రమేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.