చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ ఇన్‌స్పెక్టర్‌గా కె.కాస్ట్రో రెడ్డి నియమితులయ్యారు. గచ్చిబౌలి డిఐగా విధులు నిర్వహిస్తున్న కాస్ట్రో రెడ్డిని చందానగర్ ఇన్‌స్పెక్టర్‌గా, ఇక్కడ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన బి.రవిందర్, జగద్గీరిగుట్ట ఇన్‌స్పెక్టర్ గంగారెడ్డిలను సైబరాబాద్ సీసీఎస్‌కు, అదేవిధంగా కెపిహెచ్‌బి డిఐగా విధులు నిర్వహిస్తున్న సైదులును జగద్గిరిగుట్ట ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2004 బ్యాచ్‌కు చెందిన కాస్ట్రో రెడ్డి పాతబస్తీలోని భవానీనగర్, హుస్సేనీఆలం లలో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించారు. 8 ఏళ్ల క్రితం పదోన్నతి పొందిన కాస్ట్రో రెడ్డి కౌంటర్ ఇంటలిజెన్స్‌లో, నకిరేకల్‌లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు.

అక్కడి నుంచి గచ్చిబౌలి పీఎస్‌కు వచ్చి డిటెక్టీవ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న కాస్ట్రో రెడ్డి సరిగా గ్రేటర్ ఎన్నికల వేళ చందానగర్‌కు బదిలీపై రావడం విశేషం. మంగళవారం చందానగర్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన భాద్యతలు స్వీకరించారు. ఐతే అటు ఎన్నికల నోటిఫికేషన్ రావడం, ఇటు కాస్ట్రో రెడ్డి భాద్యతలు స్వీకరించడం ఒక్కసారిగా జరిగిపోయాయి. సిబ్బంది, స్థానిక నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజల సహకారంతో చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శాంతిభద్రతలను పరిరక్షిస్తానని కాస్ట్రో రెడ్డి తెలిపారు.
