శేరిలింగంపల్లి, ఏప్రిల్ 8 (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ నానక్ రామ్ గూడ గ్రామంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ, బూత్ కమిటీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి చంద్రశేఖర్, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు బసవ లక్ష్మీ నరసయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి ఉత్సవాలను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి కార్యకర్త 14వ తేదీ లోపు తమ తమ ఇళ్లపై బీజేపీ జెండా ఆవిష్కరించాలని కోరారు. కాంగ్రెస్ , బి.ఆర్.ఎస్ నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించి కాషాయ జెండా ఎగురవేయాలన్నారు.
అతి తక్కువ సమయంలో తీవ్ర వ్యతిరేకత మూట గట్టుకున్న చరిత్ర ఒక్క కాంగ్రెస్ పార్టీ దక్కుతుందన్నారు. ఇలాంటి సమయంలో మన బూత్ స్థాయి నాయకులు బూత్ లోని ప్రతి ఒక్కరికి వైఫల్యాలను ఎత్తిచూపుతూ, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆయుష్మాన్ భారత్, గరిబ్ కళ్యాణ్, కిసాన్ సమ్మాన్ నిధి, ముద్ర యోజన, అటల్ పెన్షన్ యోజన, అగ్నిపథ్ ఇలా ఎన్నో పథకాలు ఉన్నాయని వాటిని ప్రజలకు వివరించి అవగాహన కల్పించి అందరూ వినియోగించుకునేలా చూడాలని సూచించారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో పదికి పది కార్పొరేషన్లు గెలవాలన్నారు. భారతీయ జనతా పార్టీ విజయ పథంలో నడుస్తుందన్నా కేవలం బూత్ స్థాయి కార్యకర్తల వలన మాత్రమే అని, ప్రతి కార్యకర్త ఒక యోధుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు శివాసింగ్ , కో కన్వీనర్ మణిభూషణ్ , మహిళా మోర్చ నాయకురాలు వరలక్ష్మి, సీనియర్ నాయకులు మీన్ లాల్ సింగ్, స్వామి గౌడ్, నరేందర్ ముదిరాజ్, నరేందర్ గౌడ్, తిరుపతి, రాజు, శ్రీను, యాదగిరి, గోవింద్, శ్రీకాంత్ రెడ్డి, బబ్లూ సింగ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.