శేరిలింగంపల్లి, మార్చి 24 (నమస్తే శేరిలింగంపల్లి): మిర్యాల రాఘవరావు జన్మదినం సందర్భంగా అనేకమంది ఆయన ఇంటికి చేరుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇంచార్జ్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, సోమదాసు సత్యనారాయణ రెడ్డి, నరేందర్, విష్ణుమూర్తి, త్రినాధ రావు, దాసరి రంగారావు, అందే శ్రీరామ్ మూర్తి, సత్తిబాబు, నూకల మల్లేశ్వరరావు,, ఆవుల రంగబాబు, తిరుమల రావు, అప్పారావు, సుబ్బారావు, ఎదురుల, అభిమానులు పాల్గొన్నారు.
మిరియాల రాఘవరావు జన్మదిన సందర్భంగా పుచ్చకాయ జ్యూస్ ను పంపిణీ చేశారు. ఆయన జన్మదిన వేడుకను అభిమానులు చందానగర్ బస్ స్టాప్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా 2000 మందికి పుచ్చకాయ జ్యూస్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా చందానగర్ ఎస్సై ఆంజనేయులు హాజరయ్యారు.