శేరిలింగంపల్లి, నవంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పకళా వేదికలో కానరీ ది స్కూల్ తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మి నారాయణ విచ్చేశారు. పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ రెడ్డి, చైర్ పర్సన్ డాక్టర్ శ్వేతా రెడ్డి, ప్రిన్సిపాల్ లిడియా క్రిస్టినా, హెడ్ సీనియర్ స్కూల్ డాక్టర్ నవీన్ కుమార్ ఇమ్మడి, కోఆర్డినేటర్లు అపర్ణ, ముక్తా, ఎడ్మిన్ మేనేజర్ మహేష్ అక్కం తదితరులు పాల్గొన్నారు. ప్రిన్సిపాల్ లిడియా క్రిస్టినా విద్యార్ధుల తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరంలో కెనరి స్కూల్ సాధించిన విజయాలను గురించి వివరించారు.
చైర్ పర్సన్ డాక్టర్ శ్వేతా రెడ్డి విద్యార్ధుల ఆలోచనా విస్తృతి, సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకత మెరుగు పరచడం కోసం ఈ సంవత్సరం అమలు పరిచిన రోబోటిక్స్, MUN, G.K, యూత్ లీడర్ సిప్ ప్రోగ్రామ్ వంటి వినూత్న కార్యక్రమాలను గురించి, రాబోయే సంవత్సరంలో అమలు పరచబోతున్న అంశాలను గురించి విద్యార్ధుల తల్లిదండ్రులకు తెలియజేశారు. రెండు విడతలుగా జరిగిన ఈ ఉత్సవంలో చిన్నారులు అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. ఆనందోత్సాహాల మధ్య జరిగిన ఈ వేడుకలలో ఉపాధ్యాయులు, ఎడ్మిన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.