శేరిలింగంపల్లి, నవంబర్ 14 (నమస్తే శేరిలింగంపల్లి): గ్లో ఎల్ఈడి బల్బులను, ట్యూబ్లైట్లను అతి తక్కువ ధరకు కేవలం రూ.37కే 9W బల్బ్, రూ.110 కే 20W 4 ఫీట్ ట్యూబ్ లైట్ లను PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఇంత తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావడం చాలా ఆనందంగా ఉందన్నారు. హైదరాబాద్లో ఇండస్ట్రీ పెట్టి 200 మందికి ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా 1300 పైగా ఉత్పత్తులను తయారు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
గవర్నమెంట్ కూడా ఇటువంటి కంపెనీలకు అవకాశం ఇచ్చేందుకు కృషి చేస్తుందని ఎమ్మెల్యే గాంధీ తెలియజేశారు. ఈ సందర్భంగా గ్లో ఎల్ఈడి ఎండి బొంతు సాంబి రెడ్డితో అన్నారు. ఎండి సాంబి రెడ్డి మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా గ్లో ఎల్ఈడి అతి తక్కువ ధరలో మంచి నాణ్యతతో 13 వేల మంది వినియోగదారులకు సర్వీస్ అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగండ్ల గ్లో ఎల్ఈడీ ఛానల్ పార్ట్నర్ సిద్ధార్థ, గ్లో ఎల్ఈడి ఫ్యాక్టరీ అవుట్ లెట్ డైరెక్టర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.