శేరిలింగంపల్లి, నవంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): హైటెక్ సిటీ డివిజన్ పరిధిలోని మాదాపూర్ గ్రామంలో పశువైద్యశాలను పునరుద్ధరించాలని కోరుతూ BRS నాయకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మాదాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 87లో ఉన్న పశువైద్యశాలను కూల్చివేయడంపై నాయకులు మాదాపూర్ డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. పశువైద్యశాలను తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన డిప్యూటీ కమిషనర్, గతంలో ఉన్న విధంగా ప్రహరీ గోడ నిర్మించి పశువైద్యశాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. సమస్యపై స్పందించి హామీ ఇచ్చిన డిప్యూటీ కమిషనర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మిద్దెల మల్లారెడ్డి, నిమ్మల రామకృష్ణ గౌడ్, మహ్మద్ అల్లావుద్దీన్ పటేల్, డాక్టర్ సుదర్శన్, సాబీర్, రాజు తదితరులు పాల్గొన్నారు.






