నమస్తే శేరిలింగంపల్లి: అన్ని దానాల కంటే రక్తదానం మిన్న అని, రక్తదానంతో ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడినవారవుతారని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ మజీద్ బండ కొండాపూర్ అంబేద్కర్ చౌక్ వద్ద గల కమ్యూనిటీ హాల్ లో మహావీర్ ఇంటర్నేషనల్ సైబర్ సెంటర్ రక్తదాన శిబిరాన్ని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేసి మరొకరికి జీవితాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన వారిని అభినందించి ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అవినాష్ జైన్, సురాజ్ బండారి, జయంత్ పోగాలియా, టి. అనుజు, ఆశిష్ హేమాని, దీపక్ కత్రి, ఆశిష్ పొగాలియా, గోపాల్ యాదవ్, సుధాకర్ రెడ్డి, బ్లడ్ క్యాంప్ నిర్వాహక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
