నమస్తే శేరిలింగంపల్లి: నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఆగస్టు 5 వ తేదీన మహా బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీజేవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్ తెలిపారు. ఆదివారం భారతీయ జనతా యువ మోర్చా మాదాపూర్ డివిజన్ కార్యవర్గ సమావేశాన్ని అయ్యప్ప సొసైటీలో బీజేవైఎం డివిజన్ అధ్యక్షుడు ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ , బీజేవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు పవన్ కుమార్ పిలుపు మేరకు సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, నిరుద్యోగులకు మద్దతుగా ఆగస్టు 5 వ తేదీన బీజేవైఎం మహా బైక్ ర్యాలీని నిర్వహించనున్నట్లు చెప్పారు. సుమారు 5వేలకు పైగా బైకులతో ఎల్. బి.నగర్ నుండి కూకట్ పల్లి వరకు ఈ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. మాదాపూర్ డివిజన్ నుండి అధిక సంఖ్యలో బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొని, విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సమావేశం అనంతరం దేశ సముపార్జన కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహా నాయకుడు , స్వాతంత్ర్యం నా జన్మ హక్కు ” అని నినదించిన దేశ భక్తుడు , భారతజాతియోధ్యమ పిత , బాలగంగాదర్ తిలక్ వర్ధంతి సందర్భంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ నాయకులు గంగల రాధాకృష్ణ యాదవ్, బీజేపీ డివిజన్ ఉప అధ్యక్షుడు మధు యాదవ్, బీజేపీ డివిజన్ సెక్రటరీ గోవర్ధన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు యాదయ్య, రాజు, బీజేవైఎం డివిజన్అధ్యక్షుడు ఆనంద్ కుమార్, బీజేవైఎం డివిజన్ జనరల్ సెక్రటరీ గంగల చరణ్, బీజేవైఎం డివిజన్ ఉప అధ్యక్షుడు శివ యాదవ్, పట్నం రాము, అరునాథ్ రెడ్డి, సెక్రటరీ నరేష్ రెడ్డి, మంజు, లోకేష్, సాయి, నరేందర్, అభిషేక్ తదితరులు ఉన్నారు.