- వరద సహాయం అందని బాధితుల పేర్లు నమోదు
హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని జనప్రియ నగర్‌లో వరద సహాయం అందని బాధితులను ఆదవారం బీజేపీ నాయకుడు బోయిని మహేష్ యాదవ్ పరామర్శించారు. ఈ క్రమంలో ఆయన వారి పేర్లను నమోదు చేసుకుని జాబితా తయారు చేశారు. ఆ జాబితాను సోమవారం సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులకు అందజేస్తామని, బాధితులకు వరద సహాయం రూ.10వేలు అందేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
