నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రం లో బిజెపి పార్టీ బలపడుతోందని, రాబోయే రోజుల్లో బిజెపి గద్దెనెక్కడం ఖాయమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అన్నారు. ఢిల్లీలోని బిజెపి జాతీయ పార్టీ కార్యాలయంలో జాతీయ నాయకత్వ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్న తీన్మార్ మల్లన్న, ఉద్యమకారులు విఠల్ కు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, జాతీయ, రాష్ట్ర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.
