నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు తీపి కబురు చెప్పిందని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగిస్తూ, గ్యాస్ సిలిండ్‌పై రూ.200 సబ్సిడీ పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి ధన్యవాదాలు తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, గ్యాస్ ధరల పెంపుతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న దేశ ప్రజలకు కేంద్రం కాస్త ఉపశమనం కల్పించిందన్నారు. లీటర్ పెట్రోల్ ధరను రూ 8, డీజిల్ ధరను రూ.6 మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. సామాన్య ప్రజానీకానికి, వాహనదారులకు ఊరట కలిగించే అంశం కాబట్టి, రాష్ట్ర పరిధి లో తెలంగాణ ప్రభుత్వం కూడా రాయితీ ఇవ్వాలని కోరారు. లీటర్ పెట్రోల్‌పై 8 రూపాయల మేర, డీజిల్‌పై 6 రూపాయల మేర ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిందన్నారు. దీంతో పెట్రోల్ ధర రూ. 8, డీజిల్ ధర రూ. 6 మేర తగ్గనుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించినట్లు చెప్పారు. ఈ ఏడాది సిలిండర్‌కు రూ.200 చొప్పున గ్యాస్ సబ్సిడీ సైతం ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారన్నారు. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన లబ్ధిదారులకు ఏడాదికి 12 సిలిండర్ల వరకు ఈ సబ్సిడీ వర్తిస్తుందని ప్రకటించిన నిర్మలా సీతారామన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.