నమస్తే శేరిలింగంపల్లి: హైదరాబాద్ మహానగర మేయర్ గద్వాల విజయలక్ష్మికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు, గంగారాంకు చెందిన కంది సాయికుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి జన్మదినం సందర్భంగా ఆమె స్వగృహంలో కంది సాయికుమార్ కలిసి పుష్పగుచ్చం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు కంది సాయికుమార్ తెలిపారు.






