మా అధినేత్రిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదు – తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్

నమస్తే శేరిలింగంపల్లి: ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకులు కల్వకుంట్ల కవితపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించేది లేదని తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవితను ఆమె స్వగృహంలో కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిపై బురద జల్లుతాం అనే రీతిలో బిజెపి చీప్ పాలిట్రిక్స్ చేస్తుందని ఎద్దేవా చేశారు. బిజెపి చిల్లర రాజకీయాలు తెలంగాణలో చెల్లవన్నారు. మచ్చలేని నాయకురాలు మా అధినేత్రి అని, మా అధ్యక్షురాలిమీద అనవసరపు నిరాధార అరోపణలు మానకపోతే జాగృతి సైనికుల చేతిలో తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. సంఘీభావం తెలిపిన వారిలో రంగారెడ్డి జిల్లా ఎన్ సీ ఆర్ సీ జిల్లా చైర్మన్ చింతకింది మహేందర్ గౌడ్, సోను గౌస్, ఉదీప్, బషీర్ , నరేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ కవితను కలిసిన తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here