నమస్తే శేరిలింగంపల్లి: విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఏ ఐ ఎఫ్ డి ఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు ఐదు రోజుల పాటు పన్నెండు వందల కిలో మీటర్లు మోటార్ సైకిల్ యాత్రను చేపట్టనున్నట్లు ఏఐఎఫ్ డీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి తెలిపారు. 25న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి మోటార్ సైకిల్ యాత్ర ప్రారంభమై సంగారెడ్డి మీదుగాకామారెడ్డి, నిజామాబాద్, బాసర, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, మంచిర్యాల, బెల్లంపల్లి మీదుగా సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల సమస్యలను తెలుసుకోనున్నట్లు చెప్పారు. ములుగు నర్సంపేట్,వరంగల్, తొర్రూరు, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 30న ముగియనున్నట్లు తెలిపారు. విద్యార్థులు, ఉపాద్యాయులు, మేధావులు మోటార్ సైకిల్ యాత్రకు మద్దత్తు తెలిపి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.