నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ శనివారం నుంచి ప్రారంభించనున్న ప్రజాసంగ్రామ పాదయాత్రకు రంగారెడ్డి జిల్లా అర్బన్ ప్రధాకార్యదర్శి, యాత్ర సభ్యులు చింతకింది గోవర్ధన్ గౌడ్ శుక్రవారం బయలు దేరి వెళ్లారు. ఈ సందర్బంగా గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ అవినీతి, గడిల, కుటుంబ పాలనను అంతమోందించిండానికే బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారని అన్నారు. ఈ చారిత్రక యాత్రలో బండి సంజయ్ తో పాటు పది రోజుల పూర్తి సమయం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అవకాశం కల్పించిన పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆశీస్సులతో యాత్ర విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భాజాపా అధికారంలోకి వచ్చేందుకు ఈ యాత్రనుంచే బిజం పడటం ఖాయమన్నారు. శనివారం ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం నుంచి ప్రారంభంకానున్న ఈ యాత్రలో రంగారెడ్డి జిల్లా పరిధిలోని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.