నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ స్వామి అయ్యప్ప కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ మేనేజింగ్ కమిటీకి ఎన్నికైన నూతన కమిటీ సభ్యులు సోమవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. అయ్యప్ప సొసైటీ కాలనీలో నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. అయ్యప్ప సొసైటీ కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని చెప్పారు. కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, నాయకులు వాసు, శ్రీ స్వామి అయ్యప్ప కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ కంచర్ల మాధుసూధన్ రెడ్డి, సెక్రటరీ కూచిపూడి వెంకటేశ్వరరావు, ట్రెజరర్ ఎంవీవీకే ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ దామ వెంకటరత్నం, కమిటీ మెంబర్లు బాలకిషన్ భూక్య, భవాని పోరెడ్డి, పద్మజ చెట్పల్లి, కాలనీ వాసులు గోపాల్ రెడ్డి, రాంనారాయన్, భూపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, మహేష్, సోమిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
