అనాథాశ్రమంలో ఘనంగా వాజ్ పేయి జయంతి వేడుకలు – ఘన నివాళి అర్పించిన రవికుమార్ యాదవ్

నమస్తే శేరిలింగంపల్లి: భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి జయంతిని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పాపిరెడ్డి కాలనీలోని న్యూ లైఫ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న అనాధాశ్రమంలో పిల్లలకు భోజనం, పుస్తకాలను రవికుమార్ యాదవ్ పంపిణీ చేశారు. అనాథ ఆశ్రమంలో వాజ్ పేయి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు.

అనాథ పిల్లలతో కలిసి వాజ్ పేయి జయంతి వేడుకలు నిర్వహిస్తున్న రవికుమార్ యాదవ్

రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ ఎల్‌కె అద్వానీ, భైరాన్ సింగ్ షెకావత్ లను కలుపుకొని 1980 లో భారతీయ జనతా పార్టీని ఏర్పరిచారని అన్నారు. 1994, 1998, 1999 లో ప్రధానమంత్రి గా ఉన్న సమయంలో, కార్గిల్ యుద్ధంలో విజయాన్ని అందించడంలో, 2001 డిసెంబర్ 13 న ఇస్లామిక్ తీవ్రవాదులు భారత పార్లమెంటు పై దాడి ని సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో వాజ్ పేయి కీలక పాత్ర పోషించారు అని గుర్తుచేశారు. వాజ్‌పేయి వ్యూహాత్మక దృష్టి కారణంగా మౌలిక వసతుల కల్పన, జాతీయ రహదారుల నిర్మాణం, ప్రధానమంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన, సర్వశిక్షా అభియాన్‌, అణుపరీక్షలను నిర్వహించాలన్న భారతదేశ నిర్ణయం, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారన్నారు. వాజ్‌పేయి స్పూర్తితో ప్రజలకు జవాబుదారీగా ఉండటం, పారదర్శక పాలన, పౌరసత్వ సవరణ ఒప్పంద చట్టం, ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం, మహిళలకు, షెడ్యూలు కులాలకు, గిరిజనులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను పక్కనపెట్టడం, అందరికీ సమాన అవకాశాలు, చట్టాలు వర్తించే అంశాలపై దృష్టిపెట్టడం, జన్‌ధన్‌ యోజన వంటి విప్లవాత్మక చర్యలు , కాలం చెల్లిన చట్టాలు ఎన్నింటినో మోదీ సర్కారు రద్దుచేసిందన్నారు. మోదీ పిలుపునిచ్చిన సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్‌ వంటివి కేంద్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని వివరించారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు ఎల్లేశ్, బిజెపి సీనియర్ నాయకులు, డివిజన్ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

అనాథ ఆశ్రమంలో భోజనం వడ్డిస్తున్న రవికుమార్ యాదవ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here