చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ సబ్‌స్టేషన్ 11కేవీ మైత్రినగర్ ఫీడర్ పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కరెంటు తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్న నేపథ్యంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు చందానగర్ రైల్వే స్టేషన్ ఏరియా, చందానగర్, హుడా కాలనీలలో, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రైల్ విహార్ ఫీడర్ పరిధిలోని ఓల్డ్ లింగంపల్లి స్టేషన్ రోడ్డు, గాంధీ అపార్ట్‌మెంట్, రైల్ విహార్, రంగప్రసాద్ అపార్ట్‌మెంట్, హుడా ట్రేడ్ సెంటర్, శివాజీనగర్, తారానగర్, రామయ్య కాలనీ, వెంకటాద్రి కాలనీలలో కరెంటు ఉండదని తెలిపారు.






