నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా షేక్ రహ్మదుల్లా ను నియమిస్తూ కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఆంజనేయులు సాగర్ అధ్యక్షతన బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి డివిజన్ల వారిగా అన్నీ మోర్చాల కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. బిజెపి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ రఘునాథ్ యాదవ్, కొండాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శి రాజు, బిజెపి సీనియర్ నాయకులు గోపాలకృష్ణ, నాయకులు రామిరెడ్డి, కుమారస్వామి, శంకర్, షాబుద్దీన్, దిలీప్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.