దేశానికి దారి చూపిన మ‌హా నాయ‌కుడు అంబేద్క‌ర్‌: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 21 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారతరత్న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే పార్టీ భారతీయ జనతా పార్టీ అని, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషిచేసి మనందరికీ దారి చూపిన మహా నాయకుడు అంబేద్క‌ర్ అని, కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ ని అడుగడుగునా అవమానించి ఇప్పుడు ఓట్ల రాజకీయం చేస్తుందని, అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన చేసిన సేవలను నేటి తరానికి తెలియజేసే బాధ్యత మనందరి పైన ఉన్నద‌ని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి జయశ్రీ, రంగారెడ్డి అర్బ‌న్ జిల్లా అధ్య‌క్షుడు వానిపల్లి శ్రీనివాసరెడ్డి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా హైదర్ నగర్ డివిజన్ ఆదిత్య నగర్ కమ్యూనిటీ హాల్ లో పార్టీలకతీతంగా మేధావులు, అడ్వకేట్స్, డాక్టర్స్ , విద్యావంతులు , సాఫ్ట్వేర్ నిపుణులతో అంబేద్కర్ జీవిత చరిత్రపై సెమినార్ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తలుగా హాజ‌రైన వారు మాట్లాడుతూ మన‌ భారత జాతి గర్వించదగ్గ వ్యక్తి, డాక్టర్ భీమ్‌రావ్ రాంజీ అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నామని తెలిపారు. డాక్టర్ అంబేద్కర్ కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఒక సంఘ సంస్కర్త, గొప్ప న్యాయవాది, రాజనీతిజ్ఞుడు, ముఖ్యంగా అణగారిన వర్గాల ఆశాజ్యోతి. ఆయన జీవితం పోరాటం, పట్టుదల, అంకిత భావం మనందరికీ నిదర్శనం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ సిఎల్ వెంకటరావు, డాక్టర్ రామ్ సింగ్ నాయక్, డాక్టర్ చంద్రశేఖర్, భరత్, డాక్టర్ జ్యోతి, అశోక్ కురుమ, రామరాజు, మని భూషణ్, శ్రీనివాస్, సీతారామరాజు, వేణుగోపాల్ యాదవ్, అరుణ్ కుమార్, నరసింహ చారి, వసంత్ యాదవ్ , శేషయ్య , కృష్ణంరాజు, వీరు యాదవ్, డాక్టర్ వంశీ రెడ్డి, గోపాల్ రావు, వెంకటస్వామి రెడ్డి, అరవింద్ , లక్ష్మీనారాయణ, వరలక్ష్మి, స్రవంతి, సైదమ్మ, కృష్ణా, బాలాజీ , నర్సింగ్ , ఆంజనేయులు, సందీప్ గౌడ్ , రాజు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here