శేరిలింగంపల్లి, ఏప్రిల్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మియపూర్ లో అవంతిక కన్స్ట్రక్షన్, ఇగ్నైట్ కళశాల సంయుక్తంగా తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2nd ఎడిషన్ మియాపూర్ రన్ 5KM, 10KM రన్ కార్యక్రమాన్ని కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ అవంతిక కన్స్ట్రక్షన్ ఇగ్నైట్ కళశాల సంయుక్తంగా తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2nd ఎడిషన్ మియాపూర్ రన్ 5KM, 10KM రన్ నిర్వహించడం చాలా అభినందనీయం అని, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో శారీరక శ్రమ ఎంతో అవసరం అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అవంతిక కన్స్ట్రక్షన్ అధినేత శ్రీనివాస్ రెడ్డి, ఇగ్నైట్ కళశాల చైర్మన్ రమేష్, కాలనీ వాసులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.