నమస్తే శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా రెండో రోజున సందడిగా సాగుతుంది. కోల్ కతా నుండి విచ్చేసిన కళాకారులు జ్యూట్ వాల్ హ్యాంగింగ్స్, డాల్స్, చెప్పులు, డెకొరేటివ్ ఉత్పత్తులను స్టాల్స్ లో విక్రయానికి ఉంచారు. జాంధానీ చీరలు, బీహార్ టుస్సార్ పట్టు, చీరలు, డ్రెస్ మెటీరియల్స్, హ్యాండ్లూమ్ కాటన్ షర్ట్స్, గుజరాతి శాలువాలు, గాగ్రా డ్రెస్సెస్, హ్యాండ్ బాగ్స్, లేదర్ బ్యాగ్స్ ఈ స్టాల్స్ లో అందుబాటులో ఉన్నాయి.
సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా సంహిత గాత్ర కచేరి ఎంతగానో అలరించింది. నిన్ను కోరి, గిరిజ సుధ, వెళ్లి నాయక, అన్నమయ్య కృతి, తదితర పాటలను ఆలపించారు. మృదంగం సహకారం వీర స్వామి, వయోలిన్ పై అరుణ్ సహకరించారు. కూచిపూడి నృత్య ప్రదర్శనలో భాగంగా అనూష శ్రీనివాస్ శిష్య బృందం వినాయక కౌతం,కంజదళాయతాక్షి, కృష్ణ శబ్దం, రరావేణు, పాశ్యాత, తిల్లాన, అంశాలను అనూష, శ్రీనివాస్, లక్ష్మి భావన, హసిత, జస్మితా, సంహిత, సంజిత, సిరి చందన కళాకారులు ప్రదర్శించి మెప్పించారు.