చేనేత కళాకారులకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేయూత – ఆల్ ఇండియా క్రాప్ట్ మేళా ముగింపులో సీఎస్ సోమేష్ కుమార్

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత హస్త కళలను కాపాడుకునేందుకు కళాకారులను ప్రోత్సహిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ అన్నారు. మాదాపూర్ లోని శిల్పారామంలో ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళా ముగింపు సంబరాలు శుక్రవారం అట్టహాసంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు.

చేనేత కళాకారులను సన్మానిస్తున్న సీఎస్ సోమేష్ కుమార్

సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్ ఇండియా క్రాప్ట్ మేళాను హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ఇలాంటి వాటికి తగిన సహాయ సహాకారాలు అందించడం జరుగుతుందని చెప్పారు. లింగ శ్రీనివాస్ జానపద బృందం నగారా కొమ్ములతో సంప్రదాయబద్దంగా, శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్ రావు ఆహ్వానితులకు స్వాగతం  పలికారు. సీఎస్ సోమేష్ కుమార్ క్రాప్ట్ మేళాకు వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన చేనేత హస్త కళాకారులను కలిసి కళా ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు.

నృత్యప్రదర్శన కళాకారులతో సీఎస్ సోమేష్ కుమార్

నేషనల్ అవార్దీ వచ్చిన చేనేత హస్త కళాకారులను ఈ సందర్భంగా సీఎస్ సోమేష్ కుమార్ సన్మానించారు. ఎక్కువగా అమ్మకాలు చేసిన చేనేత కళాకారులను షా రోమి హాసన్ కు కాశ్మీరీ శాలువాలు, జహీద్ హుస్సేన్ కు కోటలను సన్మానించారు. శిల్పారామంలో పచ్చని వాతావరణాన్ని, పరిశుభ్రత, రంగు రంగు పూలతో అలంకరించడంతో పాటు టెర్రకోట ఆర్చ్ లను చూసి హర్షం వ్యక్తం చేశారు. వైదేహి సుభాష్ శిష్య బృందం ప్రదర్శించిన భరతనాట్య ప్రదర్శన ఆధ్యంతం ఆకట్టుకుంది.

సాంప్రదాయ రీతిలో సీఎస్ సోమేష్ కుమార్ కు స్వాగతం పలుకుతున్న కళాకారులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here