నమస్తే శేరిలింగంపల్లి: వనభోజనాలతో నూతన పరిచయాలు కలగడంతో పాటు ఉన్న పరిచయాలు మరింత బలపడుతాయని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని ఆరంభ టౌన్ షిప్ లో ఏర్పాటు చేసిన కార్తీక మాస వనభోజన మహోత్సవంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొన్నారు. ఆరంబ్ టౌన్ షిప్ లో ప్రతి ఏటా కార్తీక మాస వనభోజనాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఆరంబ్ టౌన్ షిప్ లో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరంబ్ టౌన్ షిప్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రవీంద్ర రాథోడ్, గౌరవ అధ్యక్షులు వెంకట బసవయ్య, అడ్వయిజరీ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, నాగేశ్వరరావు, రాజేశ్వరరావు, గోపి నగర్ బస్తీ కమిటీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, పట్లోళ్ల నర్సింహ రెడ్డి, సాయి, మహిళా విభాగం అధ్యక్షురాలు అరుణ యాదవ్, ఎస్సీ సెల్ విభాగం అధ్యక్షులు జనార్ధన్, ట్రెజరర్ నరేంద్ర కుమార్, ప్రధాన కార్యదర్శి విజయలక్ష్మి, అరుణ, మమత, సరిత, విశలక్ష్మి, విజయలక్ష్మి, సులోచన, వరలక్ష్మి, కార్తీక మాసం కమిటీ సభ్యులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.